బిజినెస్ ఐడియా: గ్లాస్ రీసైక్లింగ్ తో నెలకి లక్ష..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా…? పైగా అందులో మంచిగా లాభాలని పొందాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు అనుసరించారు అంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించచ్చు. మరి ఆ బిజినెస్ ఐడియాకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

New Statewide Glass Recycling Program In Effect July 1 | The Newtown Bee

గ్లాస్ రీసైక్లింగ్ బిజినెస్ చేసి ప్రతి నెలా లక్ష రూపాయల ఆదాయాన్ని పొందొచ్చు. గాజు బాటిల్స్, గాజు పెంకులు, షో కేసులు ఇలా చాలా వస్తువులు గాజు వాటితో తయారు చేస్తారు. వీటితో మీరు మంచిగా లాభాలను పొందవచ్చు. అయితే ఈ వ్యాపారం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే… గాజు సామాన్లు సేకరించి మీరు రీసైక్లింగ్ యూనిట్ దగ్గరకు పగిలి ఉండే వాటిని సేకరించాలి.

మీరు కావాలంటే స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ కి వెళ్లి చెత్తగా వచ్చే గాజు వాటిని తక్కువ రేట్ కి కొనుగోలు చేయవచ్చు. ఇలా వీటిని మీరు సేకరించి రీసైక్లింగ్ యూనిట్ పెట్టొచ్చు. ఒకవేళ కనుక మీరు యూనిట్ ని పెట్టలేకపోతే వీటిని తక్కువ ధరకి కొనుగోలు చేసి మీరు మరి కొంచెం ఎక్కువ ధరకు రీసైక్లింగ్ ప్లాంట్ కి అమ్మచ్చు.

రీసైక్లింగ్ ప్లాంట్ లో ఇవన్నీ కూడా పొడి లాగ మారిపోతాయి. ఆ తర్వాత ముడి పదార్థం తో మళ్లీ కొత్తగా తయారు చేయొచ్చు. అయితే దీనిని మొదలు పెట్టడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మీరు మీ పాన్ కార్డ్ వంటి వివరాలు ఇచ్చి కంపెనీ పేరు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే లేబర్ సర్టిఫికెట్ కూడా పొందాలి.

కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా 50 వేల రూపాయల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది. ఈ లోన్ ని పొంది మీరు వ్యాపారం మొదలు పెట్టొచ్చు. పైగా దీనికి కాంపిటేషన్ చాలా తక్కువ. దీనిని కనుక మీరు చక్కగా చేస్తే నెలకి లక్షల్లో ఆదాయం వస్తుంది పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news