గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదమని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడమని ఫైర్ అయ్యారు ఉత్తమ్. నెహ్రూను తక్కువ చేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్ ను తెరపైకి తీసుకు వస్తుందని అగ్రహించారు.
ఒక్క సంతకంతో దేశం మొత్తము రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. దేశ చరిత్రను వక్రికరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ చెప్పుకోవాడనికి చరిత్ర లేదు.. అందుకే మరొకరి చరిత్రను తనదిగా చెప్పుకుంటున్నారని.. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటుందని అగ్రహించారు. రాజకీయ, న్యాయ వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నాశనం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2023 లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వీఆఖతం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.