Disha Patani:” ఫిగ‌ర్ సైజ్ ఎంత?” నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన లోఫ‌ర్ బ్యూటీ

-

Disha Patani: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వారిలో దిశా ప‌టానీ ఒక‌రు. లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది ఈ అమ్మ‌డు. తెలుగు ప్రేక్ష‌కుల మదిలో కొల్లాకొట్టింది. కానీ టాలీవుడ్లో స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ కు చేక్కేసింది. అక్కడ త‌న అందాల ఆరాబోత‌తో కుర్రా కారు గుండెల్లో హీట్ పుట్టించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. అన‌తికాలంలో బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెర మీద‌నే కాదు. నెట్టింట్లో కూడా బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చ‌ల్ చేస్తుంది. త‌న‌ బికినీ పిక్స్, హాట్ ఫోటో షూట్స్ ల‌ను షేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది.

అలాగే.. ఏ మాత్రం టైమ్ దొరికినా.. ఈ బోల్డ్ బ్యూటీ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌తో ఛాటింగ్ చేస్తూ.. త‌న మాట‌ల‌తో క‌వ్విస్తోంది. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధాన‌మిస్తోంది. తాజాగా లోఫర్ హీరోయిన్ దిశా పటాని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తోంది. వారి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమిస్తుంది. కానీ.. ఆమెకు ఓ అనుకోని చెత్త ప్రశ్న ఎదురైంది.

అలాంటి వాటిని కొందరు చూడగానే స్కిప్ చేస్తుంటారు కానీ మరికొందరు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. ఇఫ్పుడు దిశా కూడా ఇదే చేసింది. అటు సీరియస్ కాకుండా.. ఇటు ఆ ప్ర‌శ్న ను వదిలేయకుండా తన స్టైల్‌లో సమాధానమిచ్చింది ఈ భామ. ‘నీ ఫిగర్ సైజ్ ఎంత’ అంటూ ఓ ఘాటు ప్రశ్న వేశాడు ఓ ఆకతాయి. తొలుత ఈ ప్ర‌శ్న చూసి షాక్ అయింది. ఏ మాత్రం సీరియ‌స్ కాకుండా.. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దాటేయ‌కుండా.. త‌నదైన శైలిలో స‌మాధాన‌మిచ్చింది. ఒక ఫన్నీ పాండా జిఫ్ వీడియోను షేర్ చేసింది.

ఇటీవల అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఓ నెటిజన్ బికినీ ఫోటో కావాలంటూ అడిగితే.. ఇంటి అడ్రెస్ ఇవ్వు ఫ్రేమ్ కట్టి పంపిస్తానంటూ త‌నదైన స్టైల్ లో షాకింగ్ రిప్లే ఇచ్చింది. అలాగే శృతి హాసన్‌ను కూడా ఓ నెటిజన్ ఫోన్ నెంబర్ అడిగితే 100 అంటూ పోలీసుల డయల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news