ఏపీ మందుబాబులకు షాక్.. మద్యం పై భారీగా వ్యాట్ పెంచిన జగన్ సర్కార్ !

-

మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ జీవో జారీ చేసిన అబ్కారీ శాఖ… మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేసింది. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది అబ్కారీ శాఖ. ఇందులో భాగంగానే రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్ల కు ఏకంగా 50 శాతం మేర వ్యాట్ విధించాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.

అలాగే రూ. 400 నుంచి రూ. 2500 వరకూ ఉన్న మద్యం కేసుకు సంబంధించి 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. రూ.2500 నుంచి రూ. 3500 వరకూ ఉన్న మద్యం కేసుకు 55 శాతం మేర వ్యాట్ విధించనుంది. రూ.3500 నుంచి రూ. 5000 వరకూ ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం మేర వ్యాట్ విధించేందుకు సన్నద్ధం అయింది సర్కార్.

అలాగే రూ.5000 ఆ పై ధర పలికే మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నాంది పలుకనుంది. దేశీయంగా తయారై ప్యాకింగ్ చేసిన బీర్ల కేసుపై రూ. 200 కంటే ధర తక్కువ ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ వడ్డించనుంది. రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేస్ పై 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇక అన్ని రకాల వైన్ మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. రెడీ టు డ్రింక్ వెరైటీలన్నిటిపైనా 50 శాతం మేర వ్యాట్ విధించనుంది. భారీగా వ్యాట్ పెంచిన.. నేపథ్యంలో ఏపీలో మద్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news