S.Thaman: మహేష్ సినిమాలో ప్రభాస్..! తమన్ ట్వీట్ వైరల్!

-

S.Thaman: సోషల్ మీడియా ఓ మాయలోకం.. అందులో పోస్టు చేసినా.. ఇటే వైర‌ల్ అవుతుంది. అందులో సెల‌బ్రెటీల పోస్టులైతే.. కాసేప్ప‌ట్లోనే ట్రెండింగ్ లో నిలుస్తాయి.. నెట్టింట్లో వైరల్ అవుతాయి. అందులో నిజమేంటో.. అబద్దమేంటో.. అవ‌స‌రం లేదు. పాపం మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ విషయంలో కూడా అదే జరిగింది. త‌మ‌న్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. త‌రుచు తాను చేసే సినిమాల అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ఇంటరాక్ట్ సెషన్స్ నిర్వ‌హించాడు. అభిమానులకు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

ఈ క్ర‌మంలో ఓ అభిమాని మహేష్ 28వ ప్రాజెక్టు కోసం అడిగాడు. త్రివిక్రమ్ దర్శత్వంలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. దానికి సమాధానం చెప్పిన తమన్.. వెరీ సూన్ ప్రభాస్ అన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమాధానాన్ని మహేష్ అభిమాని ఇచ్చిన ప్రశ్నని ట్యాగ్ చేశాడు. దీంతో మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ప్రభాస్ కూడా ఉండనున్నాడని అర్ధం చేసుకున్న ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేశారు.అయితే.. కాసేపటికే ఆ ట్వీట్ మళ్ళీ డిలీట్ చేశాడు. దీనితో మహేష్ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడా లేక అనుకోకుండా తమన్ ట్వీట్ చేశాడా? అనే చర్చ నెట్టింట్లో పీక్స్ కి చేరింది.

ఇలా పొరపాటున తమన్ చెప్పినా.. మహేష్, ప్రభాస్ కాంబినేషన్ మల్టీస్టారర్ గురించి సోషల్ మీడియాలో కొందరు అయితే.. మహేష్, ప్రభాస్ కాంబినేషన్ మల్టీస్టారర్ అని పోస్టర్లు కూడా రిలీజ్ చేసేశారు. మ‌రికొంద‌రైతే.. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండని కొందరు అభిమానులు ఊరించేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news