ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోంది – మంత్రి హరీష్ రావు.

-

కేంద్రం ఏడేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తుంది.. తెలంగాణకు చట్టబద్దంగా, రాజ్యాంగ బద్ధంగా కేటాయించాల్సిన నీటిని పంపకాలు చేయడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నీటిలో మాకు రావాల్సిన వాటాను అడుగుతున్నామన్నారు. గురువారం కేంద్రజల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హరీష్ రావు మాట్లాడారు. గజేంద్ర సింగ్ షెకావత్ కు మాకు ఏం వ్యక్తిగత పంచాయతీ లేదన్నారు. కేసీఆర్ గారి మాటలను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపిస్తుందన్నారు.

ఎన్ని సమస్యలు ఉన్న కేసీఆర్ తన తొలి ప్రాధాన్యతను నీటికే కేటాయించారన్నారు. తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే అంటే తెలంగాణ 2014 జూన్ 2 న ఏర్పడితే జూలై 14న ఇంటర్ స్టేట్ రివర్ డిస్య్పూట్ యాక్ట్ 3 కింద అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి క్రిష్ణా నదిలో తమ వాటా గురించి ఫిర్యాదు చేశామన్నారు. అయితే 13 నెలలు అయినా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సుప్రింకోర్ట్ లో పిటీషన్ వేశామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం సూచనల మేరకు ఆ పిటీషన్ కూడా ఉపసంహరించుకున్నామని తెలిపారు హరీష్ రావు. క్రిష్ణా జలాల్లో నీటి వాటా తేలాలంటే వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో సార్లు కేంద్రమంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కనిపించలేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news