బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలవి దొంగ నాటకాలే : ఆర్ఎస్ ప్రవీణ్

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ ఆరెమైసమ్మ చౌరస్తాలో తెలంగాణ మునిసిపల్ కార్మికుల రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ ధర్నాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. వరిరైతుల గురించి టీఆర్‌ఎస్‌, బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని ఫైర్‌ అయ్యారు.

మీ రెండు ప్రభుత్వాలు గిడ్డంగుల్లో నిలువ ఉన్న బియ్యాన్ని ఆకలితో అలమటిస్తున్న పేదలకు రేషన్ కార్డ్ ద్వారా పంచుతే మీ సొమ్మేంపోతది? సచివాలయం,కమాండ్ సెంటర్లకు వెచ్చించే డబ్బుతోరాష్ట్రమే రైతులనుండి వడ్లు కొంటే ఏం పోతది? అంటూ నిప్పులు చెరిగారు. మీ కుటుంబాలు మురికిగుంటలో దిగి పని చేస్తే కార్మికుల విలువ మీకు తెలుస్తోందని… ప్రమాదమని తెలిసినా కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు… వారి న్యాయమైన డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు చేరుకుంటున్నారా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. కార్మికుల రక్తం త్రాగుతున్న మునిసిపల్ అధికారుల భరతం పడతామని…. కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించేంత వరకు నిరాహారదీక్షలు కొనసాగుతాయని చెప్పారు.