ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనలేమని కేంద్రం చెబుతూ ఉంటే.. ఎలాగైనా కొనాల్సిందే అని టిఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అయితే ధాన్యం కొనుగోలు అంశంపై నిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా రైతుల పక్షాన ధర్నాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్రంపై మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయగా… రసమయి బాలకిషన్ ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే నిన్నటి ధర్నాలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక దేశంగా ప్రకటించాలని టు టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ లో జరిగిన ధర్నాలో టిఆర్ఎస్ జెడ్పిటిసి నాగం భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంటే… తెలంగాణ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దేశంలో తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ ఆదుకుంటారని భూమయ్య స్పష్టం చేశారు. అయితే భూమయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.