సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ ను బురిడీ కొట్టించిన హైదరాబాద్‌ యువతి..పెళ్లి పేరుతో !

-

మొబైల్‌ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా ప్రస్తుతం.. అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదో ఒక రూట్‌ చూసుకుని.. అమాయక జనాలను మోసం చేసి… డబ్బులు కాజేస్తున్నారు. ఇందులో మహిళలు ఏ మాత్రం తక్కువ కాకుండా దూసుకెళుతున్నారు. అమాయకమైన అబ్బాయిలను టార్గెట్‌ చేసి… డబ్బులు గుజ్జేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది.

ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ యువకున్ని బురిడీ కొట్టించింది హైదరాబాద్‌ కు చెందిన యువతి. పెళ్లి పేరుతో… ట్రాప్‌ చేసింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై… సికింద్రాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువకుడిని ట్రాప్‌ చేసింది ఆ యవతి.

పెళ్లి పేరుతో పరిచయం పెంచుకున్న యువతి తనకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటూ విడుతల వారిగా ఏకంగా.. రూ. 95 లక్షలు తన అకౌంట్లో కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. కొద్ది రోజుల నుంచి ఆ యువతి ఫోన్ కలవక పోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు ఆ యువకుడు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

Read more RELATED
Recommended to you

Latest news