రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బండి సంజయ్ పర్యటన

-

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరుస్తుందని.. రైతుల మధ్యనే కేసీఆర్‌ ప్రభుత్వ తీరును ఎండ గడతామని హెచ్చరించారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించనున్నారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్…. అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. అలాలే ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు.కాగా.. గత కొన్ని రోజులన నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news