ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్ధులకి గుడ్ న్యూస్ చెబుతోంది. విద్యార్థులు భవిష్యత్తులో CFOలుగా మారడానికి ప్రత్యేక ప్రణాళిను తయారు చేయడం జరిగింది. దేశంలోని టాప్ B పాఠశాల ‘ఫ్యూచర్-రెడీ CFO’ అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఇది స్టూడెంట్స్ కి ప్లస్ అవుతుంది.
ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ టాలెంట్‌స్ప్రింట్ తో కలిసి పని చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఇది ఆరు నెలల కోర్సుగా రూపొందించారు. జనవరి 2022న హైదరాబాద్ లోని ISB క్యాంపస్‌లో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ isb.talentsprint.com/cfo/ ను సందర్శించాలి. రాబోయే కొద్ది సంవత్సరాలలో C-సూట్ పాత్రలను పోషించాలనుకునే కొత్త-తరం ఫైనాన్స్ లీడర్లను తయారు చేస్తుందని అన్నారు. ఈ కోర్సు వ్యాపార పరివర్తనకు కీలకమైన సహాయకులుగా మారడానికి భవిష్యత్తు-సంబంధిత డిజిటల్ సాంకేతికతలు, ఆర్థిక వ్యూహాలతో వారికి శక్తినిస్తుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
ముందుగా అధికారిక వెబ్సైట్ https://isb.talentsprint.com/cfo/ ను సందర్శించాలి.
నెక్స్ట్ Admissions by selection. Limited seats లోకి వెళ్లాలి.
ఇక్కడ మీ యొక్క పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి.
అక్కడ అప్లై మీద క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలతో కూడిన బ్రౌచర్ అందిస్తారు.
బ్రౌచర్ ఆధారంగా దరఖాస్తు ఫాం నింపాల్సి వుంది.