పంచ్ ప్రభాకర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు వారెంట్ జారీ

-

న్యాయస్థానం, న్యాయాధికారులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్‌కు ఉచ్చు బిగుస్తున్నది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ, నవంబర్ 8న పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం వారెంట్ తీసుకున్నది. నిందితుడి అరెస్టుకు సహకరించాలని ఇంటర్‌పోల్‌ను సైతం కోరినట్టు సీబీఐ తెలిపింది. న్యాయస్థానం, న్యాయాధికారులపై అనుచిత వ్యాఖ్యల కేసులో పంచ్ ప్రభాకర్‌ను 17వ నిందితుడిగా చేర్చినట్లు సీబీఐ పేర్కొన్నది.

సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులను అవమానించేలా పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజులు అరెస్టు చేయాలని ఏపీ హైకోర్టు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ వీలు కాకపోతే సీబీఐకు సంబంధం లేకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికతో పంచ్ ప్రభాకర్ కేసును సీబీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అరెస్టు వారెంట్ తీసుకోవడంతో ఏ క్షణానైనా పంచ్ ప్రభాకర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news