సౌతాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్…

-

కరోనాతో మళ్లీ ప్రపంచం కలవరపడుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేసులు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో, రష్యాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, రష్యా దేశాల్లో రోజుకు కరోనా కేసుల సంఖ్య సగటున 40 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాలు కొత్త కేసులతో తీవ్ర ఒత్తడిని ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొత్తగా వస్తున్న వేరియంట్లు ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి.

corona

తాజాగా దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ బయటపడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌తో గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. కొత్త వేరియంట్‌కు బీ1.1.529 పేరు పెట్టారు. జెనోమిక్‌ సీక్వెన్సింగ్‌ ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది బీ1.1.529 వేరియంట్‌ బారినపడ్డారు. సౌతాఫ్రికాతో పాటు బోట్సువానా, హాంకాంగ్ లో కూడా ఈ కొత్త రకం వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇస్తున్నవ్యాక్సిన్లు ఈ వేరియంట్లను ఎంత వరకు అడ్డుకుంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

గతంలో ఏర్పడ్డ డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచంలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. చాలా వేగంగా ఒకరినుంచి ఒకరికి వ్యాపించడంతో డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news