పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నటనపై ఆసక్తిగల 50 నుండి 70 మధ్యవయస్కులకు బంపారఫర్ ప్రకటించింది. తాము ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు రావాలని పిలుపునుచ్చింది.
అంతే కాకుండా ఆడిషన్స్ కు వచ్చేవాళ్లు హైదరాబాద్ లో నివాసం ఉండే వారు కావాలని పేర్కొంది. ఇక తమ వీడియోలను ఆడిషన్ కోసం [email protected] అనే మెయిల్ ఐడీకి పంపాలని వెల్లడించింది. ఇక నటనపై ఆసక్తి ఉన్నవాళ్లు గనక ఆడిషన్స్ కు వెళ్లి సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే ఏకంగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంటారు. అంతే కాకుండా ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.