కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో వస్తున్న సినిమా 118. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ వచ్చిన ఈ ఈవెంట్ లో ముగ్గురు హీరోలు ఉన్నా అందుకు తగిన ఉత్సాహం మాత్రం వారిలో కనబడలేదు.
ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి బాలకృష్ణ ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇక ఎన్.టి.ఆర్ కూడా సీరియస్ గానే కనిపించాడు. కళ్యాణ్ రాం తన సినిమా కాబట్టి ఆయన కూడా నవ్వుతూ కనిపించలేదు. ఫైనల్ గా ఈవెంట్ లో ఎన్.టి.ఆర్, బాలయ్య, కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ బయోపిక్ ప్రస్థావన తేకుండానే 118 ఈవెంట్ కానిచ్చేశారు.
బాలకృష్ణ మాత్రం 118 ని 189 అని చెప్పడం నందమూరి ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేసింది. స్టేజ్ మీద బాలయ్య ఉండగా ఎన్.టి.ఆర్ అని అరవడం కాస్త ఇబ్బందిగానే అనిపించి ఉంటుంది.