కవిత మళ్ళీ ఆ మిస్టేక్ చేయరా?

-

తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి ఢోకా లేని విషయం తెలిసిందే. కేసీఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ పదవులు ఉన్నాయి. ఆఖరికి గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఓడిపోయిన కవితకు సైతం ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవమయ్యారు. అయితే ఆరేళ్ళ పాటు కవిత ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. అంటే మధ్యలో మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం జరిగే పని కాదా? అంటే మళ్ళీ ఆమె పోటీ చేయడానికి సిద్ధంగా లేరని మాత్రం అర్ధమవుతుంది.

గత ఎన్నికల్లో ఓడిపోయాక కవిత చాలా రోజులు రాజకీయాలకు దూరం జరిగారు. మధ్యలో కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ పదవీకాలం ముగియడంతో ఈ సారి కవితని రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో…కవితకు ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు. ఎలాగో రాజ్యసభ పదవీకాలం మూడేళ్లే కాబట్టి..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు పోటీకి దిగుతారని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా కవిత ఎమ్మెల్సీగా మళ్ళీ బరిలో దిగారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవమయ్యారు. ఇక ఎమ్మెల్సీ పదవి ఆరేళ్లు ఉంటుంది. అంటే ఆరేళ్ళ పాటు కవిత ఎమ్మెల్సీగా కొనసాగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మధ్యలో ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది.

ఒకవేళ ఎంపీగా పోటీకి దిగాలని అనుకుంటే…ఇప్పుడు ఫుల్ టైమ్ ఎమ్మెల్సీ పదవి కావాలని అనుకునే వారు కాదు. దీని బట్టి ఛూస్తే కవిత ఎట్టి పరిస్తితిల్లోనూ ఎంపీగా పోటీ చేయడం కష్టమని తెలుస్తోంది. నెక్స్ట్ కూడా ఎమ్మెల్సీగానే ఆమె రాజకీయం చేసేలా ఉన్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ తరుపున కొత్త అభ్యర్ధి బరిలో దిగుతారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news