2022లో ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన ఆ దేశంలోనే…!

-

ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ప్రధాన మోదీ ఇదివరకే అనేక దేశాల్లో పర్యటించారు. విదేశీ వాణిజ్యం, వ్యాపారం, రాజకీయ సంబంధాల్లో గణనీయమైన పురోగతి కోసం ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చన తర్వాత విదేశీ పర్యటన సంఖ్య పెరగింది. ఈ పర్యటనలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా… మోదీ మాత్రం విదేశాలతో సంబంధాలను పటిష్ట పరుచుకోవడానికి తరుచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా 2022లో మోదీ తొలి విదేశీ పర్యటనకు కూడా షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

2022 జనవరిలో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటన చేయనున్నట్లు తెలిసింది. జనవరిలో పర్యటనలో భాగంగా కీలమైన దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొననున్నారు. వాతావరణం, జీవవైవిధ్యం, అంతరిక్షం, పట్టణ మరియు గ్రామీణ అభివృద్ధి, సహనం, ప్రపంచ లక్ష్యాలు , ఆరోగ్యం, ఆహార వ్యవసాయం మరియు జీవనోపాధిపై ఆయన యూఏఈ అధినాయత్వంతో చర్చలు జరుపనున్నారు. ప్రధాని మోదీ ఇంతకుముందు 2015, 2018, 2019లో యూఏఈని సందర్శించారు. ఆ దేశ అత్యున్నత పురస్కారం  ’ఆర్డర్ ఆఫ్ ది జాయెద్‌‘ను కూడా అందుకున్నారు. భారత్ తో యూఏఈకి గట్టి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్ కు యూఏఈ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆదేశంలో దాదాపు 30 శాతం మంది భారతీయులు అంటే దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. యూఏఈలో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news