డెల్టా కంటే ఒమైక్రాన్ ప్రమాదకరమైందా? డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెబుతోంది

-

గతవారం దక్షిణాఫ్రికాలో బయట పడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ వేరియంట్ ప్రస్తుతం 13 దేశాలకు విస్తరించింది. కొత్త వేరియంట్ విస్తరించకుండా ఉండటం కోసం ఆయా దేశాలు ట్రవెల్ బ్యాన్, ఆర్‌టీ-పీసీఆర్, క్వారంటైన్ తదితర ఆంక్షలను విధిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఒమైక్రాన్‌ గురించి తాజా ఫలితాలను వెల్లడించింది.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒమైక్రాన్‌తో మళ్లీ ఇనెఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. గతంలో కొవిడ్-19 బారిన పడిన వ్యక్తులకు కొత్త వేరియంట్‌తో సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉన్నది.

డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి(ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మరింత సులభంగా వ్యాప్తి చెందడం) చెందుతుందా? అనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే, ఆర్‌టీపీసీఆర్ టెస్టు ద్వారా కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించవచ్చు.

కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయి అనే విషయమై డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నది.

ఒమైక్రాన్ ద్వారా వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదని అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. ఇతర స్ట్రెయిన్లతో పోలిస్తే ఒమైక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగినట్లు ప్రాథమిక డేటా సూచిస్తుంది. అయితే, హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య పెరగానికి కారణం కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కాకపోవచ్చని తెలిపింది. అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడటం వల్ల హాస్పిటలైజేషన్ పెరిగి ఉండవచ్చని పేర్కొన్నది. యువతలో తక్కువ లక్షణాలు ఉండవచ్చని తెలిపింది. ఒమైక్రాన్ ప్రవర్తన తీరు స్పష్టంగా తెలియడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news