ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాంప తెలిపారు. ఇటీవల కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై యావత్ సినీ పరిశ్రమ దిగ్భాంతి వ్యక్తం చేశారు. దాదాపు 10 భాషల్లో 800 సినిమాలకు డ్యాన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. చిరంజీవి, పవన్ కళ్యాన్ వంటి ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాస్టర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. నాట్య సంప్రదాయాలకు చక్కని అభియనం జోడించారని చెప్పారు. పది భాషల్లో వందలాది చిత్ర గీతాలకు నృత్యరీతులు సమకూర్చారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.‘ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ పరమపదించారని తెలిసి విచారించాను. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు వారు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవి.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విటర్‌లో పోస్టు చేశారు.
ప్రముఖ నృత్య దర్శకుడు శ్రీ శివశంకర్ మాస్టర్ పరమపదించారని తెలిసి విచారించాను. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు వారు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవి. pic.twitter.com/g5wtYxIlKX
— Vice President of India (@VPSecretariat) November 29, 2021