Sirivennela Sitaramashastri : సిరివెన్నెల మృతిపై ప్రముఖుల నివాళులు

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవ్వాళ మృతి చెందారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయన మృతిపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా వారి సంతాపాన్ని తెలుపుతున్నారు.

ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- రేవంత్ రెడ్డి

తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాయ‌డం జ‌రిగింది. సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు. ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా భాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంభ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను – నంద‌మూరి బాల‌కృష్ణ‌

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి లేని లోటు తీర్చలేనిద‌ని, తెలుగు సాహిత్యం, సినిమా రంగానికి ఆయ‌న ఎన‌లేని సేవ‌చేశార‌ని సినీహీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ ట్వీట్

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతి.

 

Read more RELATED
Recommended to you

Latest news