జర బద్రం : మీ పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారా.. సూసైడ్ వీడియోలు వస్తున్నాయ్ జాగ్రత్త..!

-

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు ఉన్న ఈ యాంత్రిక యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అంతేకాదు ఒకప్పుడు ఊళ్లో ఒకరిద్దరి దగ్గర ఉండే కంప్యూటర్, ల్యాప్ ట్యాప్ ఇప్పుడు ఇంటికొకటి చొప్పున టివితో పాటు ఉంటున్నాయి. అయితే వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో అన్ని అనర్ధాలు ఉన్నాయి. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కంప్యూటర్ లోనో.. సెల్ ఫోన్ లోనో యూట్యూబ్ వీడియోలు చూడటం కామన్.

అవి లాక్కుంటే వారి ఏడుపు భరించడం కష్టమని మనం వారిని అలానే చూడనిస్తున్నాం కాని వాటి వల్ల జరిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగుండదు.. అది పక్కన పెడితే కొత్తగా యూట్యూబ్ వీడియోల్లో సూసైడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ వచ్చే వీడియోలు ఎక్కువయ్యాయని తెలుస్తుంది.

రీసెంట్ గా ఇలాంటి ఓ సంఘటన ఫ్లోరిడాలో జరిగింది.. యూట్యూబ్ చూస్తూ ఉన్న పిల్లాడిని చూసి తన పనిలో తాను బిజీ అయిన ఓ మదర్ తీరా వచ్చి చూస్తే ఆ యూట్యూబ్ లో సడెన్ గా చేతి మణికట్టుని గ్లాస్ తో కట్ చేసుకునే వీడియో ప్రత్యక్షమైందట.. వెంటనే ఆమె భయభ్రాంతులకు గురై. వెంటనే ఆ వీడియోని తీసేసి పిల్లాడిని దగ్గరకు తీసుకుందట.

అయితే ఆ తర్వాత కూడా యూట్యూబ్ వీడియోస్ లో అలాంటివి ఒకటి రెండు సార్లు రిపీట్ అయ్యాయట.. ఆ సూసైడ్ ఇన్ స్ట్రక్షన్స్ వల్ల పిల్లల్లో ఆ ఆలోచనలు కలిగేలా చేస్తాయి. అందుకే ఇక నుండి పిల్లలకు యూట్యూబ్ వీడియోలు చూపించడం మానేయండి. సాధ్యమైనంతవరకు సెల్ ఫోన్, కంప్యూటర్ లాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచితే బెటర్. ఏదైనా జరిగాక అనుకోవడం కన్నా ముందుగా జాగ్రత్త పడటం మంచిదే కదా.

Read more RELATED
Recommended to you

Latest news