పాపం రకుల్ సీనియర్ హీరోతో సర్ధుకుందా..!

-

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది. స్పైడర్ తర్వాత తెలుగు పెద్దగా అవకాశాలు అందుకోని రకుల్ ప్రీత్ సింగ్ నాని విక్రం కుమార్ కాంబోలో వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. లీడ్ హీరోయిన్ నుండి ఐటం సాంగ్ తో సరిపెట్టుకుంటున్న రకుల్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోకి జోడీగా నటిస్తుందని తెలుస్తుంది.

కింగ్ నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ మూవీ అయిన మన్మథుడు సీక్వల్ గా వస్తున్న మన్మథుడు-2లో రకుల్ నాగ్ సరసన లక్కీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్రలో రకుల్ నటిస్తుందని తెలుస్తుంది. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగ చైతన్యతో జతకట్టిన రకుల్ ఇప్పుడు నాగార్జున సరసన నటించే ఛాన్స్ దక్కడం తండ్రి కొడుకు ఇద్దరితో రకుల్ నటించి కొత్త క్రేజ్ తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news