డిస్కో రాజాకి కష్టాలు తప్పవా..!

-

మాస్ మహరాజ్ రవితేజకు ప్రస్తుతం కాలం ఏమాత్రం కలిసి రావట్లేదని చెప్పాలి. రాజా ది గ్రేట్ తర్వాత వరుసగా మూడు సినిమాలు నిరాశపరచడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడు రవితేజ. ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరక్టర్ విఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈమధ్యనే షూటింగ్ మొదలైన ఈ సినిమా కథ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకు దగ్గరగా ఉందని తెలుస్తుంది.

ఇక్కడ విశేషం ఏంటంటే ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. రెండు సినిమాల కథలు ఒకే లైన్ తో తెరకెక్కుతున్నాయట. అందుకే డిస్కో రాజా ఆలోచనలో పడ్డాడని తెలుస్తుంది. కుదిరితే కథ మార్చడం లేదా సినిమానే ఆపేయాలన్న ఆలోచనలో చర్చలు జరుపుతున్నారు. ఎలా చూసినా డిస్కో రాజాకి కష్టాలు తప్పేలా లేవు. మూస థోరణిలో సినిమాలు చేస్తున్న రవితేజ కొత్తగా ప్రయత్నిస్తే తప్ప బాక్సాఫీస్ దగ్గర నెగ్గుకు రావడం కష్టమని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news