కార్తీకదీపం ఎపిసోడ్ 1212: తప్పు నా కొడుకుచేసుంటే..నీతో విడాకులు ఇప్పించేదాన్ని అంటూ దీప ముందు సౌందర్య ఆవేదన: తప్పు నా కొడుకుచేసుంటే..నీతో విడాకులు ఇప్పించేదాన్ని అంటూ దీప ముందు సౌందర్య ఆవేదన

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత మీరే న్యాయం చేయండి, నా బిడ్డకు తండ్రి కార్తీక్ అంటూ ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది కదా..దీప మోనితను పక్కకు లాగి తను పోడియం దగ్గర నిలబడి అందరికి నమస్కారం నా పేరు దీప నేను డాక్టర్ కార్తీక్ గారి తాళి కట్టిన భార్యను. కొందరు వారికి వారే తాళికట్టుకుని భార్యలాగా చెలామణి అవుతున్నారు లేండి, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అంటుంది. ఈ మోనిత గారు ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడారు..మోనిత గారు చెప్పినవన్నీ అబద్ధాలు..అందమైన అబద్ధాలు, మా వారు కార్తీక్ కి మోనితకు మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది, ఆ చనువుతో ఒకటి రెండు సార్లు వాళ్ల ఇంటికి వెళ్లారు అంతే..మా ఇద్దరి మధ్య ఏవో అపోహలు వచ్చాయి. అవి కూడా సృష్టించినవే..మేము కలిశాం. మోనిత ఒళ్లు కొవ్వు ఎక్కి గర్భం తెచ్చుకుంది. ఇలాంటి వాళ్లను మా ఊర్లో ఏమంటారో తెలుసా అంటుంది. మోనిత మొఖం మాడిపోతుంది. వద్దులేండి సభ్యత కాదు అంటుంది దీప. మోనిత దీప అంటే..ఆగు పాప అంటుంది. ఈ మోనిత చాలా చేసింది కిడ్నాప్ లు, యాక్సిడెంట్ లు, మనుషులు మార్చడాలు అబ్బో చాలానే చేసింది. జైలుకు వెళ్లివచ్చింది. పెద్దలు మీరే ఆలోచించాలి తప్పు ఎవరిదో అని స్జేజ్ దిగితుంది. మోనిత పిచ్చ ఫైర్ లో అక్కడినుంచి బయటకు వస్తుంది.

karthika-deepam

భారతి కార్తీక్ ని స్జేజ్ మీదకు ఆహ్వానిస్తే..కార్తీక్ నమస్కారం పెట్టి లేస్తాడు. బయట ప్రియమణి మోనితతో ఎందుకమ్మా ఇవన్నీ..మీరు ఏం చేసిన కార్తీకయ్య మిమ్మల్ని పట్టించుకోడు..ఎందుకు పరువుతీసుకోవటం అంటే..మోనితకు అసలే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నాకు సలహాలు ఇవ్వకు ప్రియమణి..ఎవరు కాదన్నా నేను కార్తీక్ ను దక్కించుకుంటా అంటూ శపథాలు చేస్తుంది. ఇంతలో కార్తీక్ వాళ్లు బయటకు వస్తారు. మోనిత కార్తీక్ ని పిలిచి కంగ్రాస్ట్ కార్తీక్ ప్రసిడెంట్ వి అయ్యావు అంటుంది. కార్తీక్ మోనిత మీదకు వెళ్లబోతే..సౌందర్య, దీప ఆపుతారు. మోనిత మళ్లీ ఆనంద్ రావు గారు మీ డాడీ ప్రసిడెంట్ అయ్యార్రా అంటుంది. కార్తీక్ మోనిత కొట్టడానికి వెళ్తుంటే..సౌందర్య, దీప పట్టుకుంటారు. వదులుమమ్మీ..ఈరోజు దీన్ని చంపేస్తాను అంటాడు. సౌందర్య ఇంకొక్క మాట మాట్లాడావంటే నా మీద ఒట్టే అంటుంది సౌందర్య. కార్తీక్ వెళ్లిపోబోతాడు. అయినా ఈ మోనిత ఆగదు..అరెరరే ఏం సెంటిమెంట్..కార్తీక్ నీకు ఆడపిల్లలు ఉన్నారు, నన్ను క్షోభపెడుతున్నావు, నా శాపం తగలుతుంది, కార్తీక్ ఎన్నిరోజులు తప్పించుకుంటావో చూస్తాను, నీ పిల్లల బతుకు కూడా నాలాగే అనబోతుంది. దీప రెచ్చిపోయి..మోనిత దగ్గరకు జట్ స్పీడ్ లో వెళ్లి..ఏయ్ ఇంకొక్కమాట నా పిల్లల గురించి, డాక్టర్ బాబు గురించి మాట్లాడోవో..పీక పిసికి చంపేస్తాను, వెళ్లు అని గట్టిగా అరుస్తుంది. ప్రియమణి రండమ్మా వెళ్దాం అంటే..వెళ్లిపోవడానికి కాదు నేను ఇదంతా చేసేది, పర్మినెంట్ గా మీ ఇంట్లోనే ఉండటానికి, ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటాను , గుర్తుపెట్టుకోండి అని మోనిత వెళ్లిపోతుంది.

ఇంట్లో ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ వాళ్లు మొఖాలు ఏలాడేసుకుని వస్తారు. ఆదిత్య అన్నయ్య ప్రసిడెంట్ అయిపోయాడా, మీరంతా హ్యాపీయా అంటాడు. ఎ‌వరూ ఏం మాట్లాడరు. వదినా అందరూ డల్ గా ఉన్నారేంటి, ఏమైంది అంటే..అక్కడికి మోనిత వచ్చింది ఆదిత్య అంటుంది దీప. సౌందర్య మోనిత అక్కడ చేసిన రచ్చ అంతా చెప్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని ఆదిత్య అంటే..చేయటానికి ఏముంది రా…ఆ మోనిత పగబట్టింది, మన కుటుంబం ఆనందంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది. దానికో పరిష్కారం ఉండాలికదా మమ్మీ అంటాడు ఆదిత్య. మనం దానికి బయపడితే అది ఇంకా రెచ్చిపోతుంది. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా..పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. స్నాక్ చేయమ్మా, స్వీట్ చేయమ్మా అంటారు. దీప తర్వాత చేస్తా అంటే..ఇప్పుడే చేయమ్మా అంటారు. ఆదిత్య మీరు చెప్పగానే చేయమంటే ఎలాగా..ఇక్కడ మాట్లాడుతున్నాం కదా.. వెళ్లండి అని అరుస్తాడు. దీప చేస్తానులే అనటంతో పిల్లలు వెళ్లిపోతారు.

ఇక్కడ మోనిత అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. లాయర్ సురేష్ ఫోన్ చేస్తాడు. మనం అనుకున్న పని కంప్లీట్ చేస్తున్నాను, ప్రాసెస్ అంతా అయిపోయింది. మూడు నాలుగు రోజుల్లో అయిపోతుంది. చాలా కష్టపడ్డాను మేడమ్ అంటే..మీ కష్టానికి తగిన ప్రతిఫలం నేను ఇప్పుడే ట్రాన్స్పర్ చేస్తాను అంటుంది మోనిత. లాయర్ పని అయిపోతుంది అని చెప్పడంతో మోనిత తెగ సంబరపడుతుంది.

మరోపక్క సౌందర్య, దీప హాల్ లో కుర్చుని ఉదయం జరిగిందాని గురించి ఆలోచిస్తారు. ఏంటే అసలు ఏం జరుగుతుంది, ఇలా ప్రతిసారి ఆ మోనిత వచ్చి అడ్డుపడుతుంటే ఎలాగే, ఈరోజు నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఆ మోనితను గద్దించాం, కార్తీక్ ఒక్కడే ఉంటే..కార్తీక్ పరిస్థితి ఎలా దీప అంటుంది సౌందర్య. మీరే ఇలా మాట్లాడితే ఎలా అత్తయ్య అంటుంది దీప. ఏం చేయను..వాడి తప్పు లేదు అనలేము, అలా అని వాడిదే తప్పు అనలేం..ఇలా చూస్తు ఊరుకోలేం..అసలు వాడు తప్పు చేస్తే ఇంత ఆలోచించే దాన్ని కాదు అంటుంది సౌందర్య. ఏం చేసేవాళ్లు అంటుంది దీప. వాడికి విడాకులు ఇప్పించి, నిన్ను మహారాణిలా చూసుకునే దాన్ని అంటుంది. ఏంటి అత్తయ్యమీరు అంటే..నువ్వంటే నాకు అంత ఇష్టం దీప.. అంటూ పాపం వాడు నలిగిపోతున్నాడే..వాడిని అలా చూస్తూ భరించలేకపోతున్నాను దీప అంటూ సౌందర్య ఏడుస్తుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news