కేసీఆర్ కు ఏది చేత కావడం లేదు : షర్మిల ఫైర్

సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత.. వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. ఆర్టీసీ చార్జీల పెంపు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదివేస్తే ఉన్న మతిపోయినట్టు, ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని చెప్పుకునే దొర గారికి.. సీఎం పదవిలో ఉన్నా ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని నిప్పులు చెరిగారు.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

”ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఛార్జీల పెంపునకు తయారయ్యారు దొరగారు.. ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారు. అయ్యా దొరగారు, ఎందుకు ఈ నష్టాల డ్రామా? రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా? మీరు తలుచుకొంటే ఆర్టీసీ నష్టాలను పూడ్చడం కష్టమా?”అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. కానీ ఆర్టీసీని మీ అనుచరులకు అప్పగించేందుకు ఈ డ్రామా ఆడుతున్నామని చెప్పొచ్చు కదా సారు అంటూ ఎద్దేవా చేశారు వైఎస్‌ షర్మిల.