వరి పండించినా.. ఇబ్బంది లేదు : నిజామాబాద్ కలెక్టర్ సంచలనం

-

యాసంగిలో వరి పండించినా అభ్యంతరం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. పంట మార్పిడిపై సంబంధిత అధికారులతో, రైతు సమన్వయ సమితి సభ్యులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్ నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా పంటలకు పెట్టింది పేరని… విత్తనోత్పత్తి చేస్తూ ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న జిల్లా నిజామాబాద్ అని వివరించారు.

యాసంగిలో పంట మార్పిడికి సంబంధించి రేపటి నుంచి ప్రతీ మండలంలోని రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలని వెల్లడించారు. ఏ పంటలు వేస్తే బాగుంటుందన్న దానిపై అర్థవంతమైన చర్చ జరగాలనే ఉద్ధేశ్యంతోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ విత్తనాలైతే నాణ్యమైనవి, ఎలాంటి సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు అనుసరించాలన్న అన్ని అంశాలపై రైతుల్లో స్పష్టతను తీసుకువచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడాలన్నారు. వరి పండించినా అభ్యంతరం లేదుగానీ.. ఏ రకం పండిస్తే బాగుంటుందని సూచనలు చేశారు. దాన్నెక్కడ అమ్ముకోవచ్చు, మార్కెట్ ఎక్కడ అనుకూలంగా ఉంటుందో రైతులకు మాత్రం స్పష్టత ఉండాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news