PUSHPA : పుష్ప నుంచి మరో అప్డేట్..హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా మూవీ లో ఐకాన్‌ స్టార్‌ హీరో బన్నీకి జోడీగా శ్రీ వల్లి పాత్ర లో రష్మిక మందనా నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా.. హిందీలోనూ విడుదలకానుంది. అయితే తాజాగా హిందీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రబృందం. డిసెంబర్ 17 వ తేదీన హిందీలో పుష్ప సినిమా రిలీజ్ కానున్నట్లు పోస్టర్ను వదిలింది. ఇక అటు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పుష్ప డిసెంబర్ 15వ తేదీనే థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news