దేశంలో ఐదో ఒమిక్రాన్ కేసు నమోదు

-

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి టాంజానియా నుంచి న్యూఢిల్లీ రాగా, అతడికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటవ్‌ రావడంతోపాటు ఒమిక్రాన్‌గా వేరింట్‌గా తేలిందని ఆరోగ్య మంత్రి సత్యందర్ జైన్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఒకటి చొప్పున, కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి.

దేశంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా 2,796 మరణాల సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,73,326కు చేరుకున్నది. 8,895 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డేటా స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3,45,33,255కు చేరుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news