కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలి బాధను ప్రతిబింబించేలా విగ్రహం ఏర్పాటు

-

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో ఓ మెడికో విద్యార్థిని దారుణంగా లైంగికదాడికి పాల్పడి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఓ వైపు విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు జూనియర్ వైద్య విద్యార్థులు బాధితురాలికి సంఘీభావంగా విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ప్రధానంగా మెడికోలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార సంఘటనకు నివాళిగా జూనియర్ డాక్టర్లు ఆర్జీ కర్ ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ ఆఫీసు వద్ద ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారు. లైంగికదాడి సమయంలో బాధితురాలు పడిన క్షోభ, బాధ, నొప్పిని ప్రతిబింబించేలా శిల్పి అసిత్ సైన్ ఈ విగ్రహాన్ని రూపొందించాడు. దీనికి ‘క్రై ఆఫ్ ది అవర్’గా నామకరణం చేశారు. అయితే, విగ్రహావిష్కరణపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news