వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, ఆడి, బెంజ్ కార్ల కంపెనీలు తమ కార్లపై ధరలను పెంచాలాని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో మరికొన్ని కార్ల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై ధరలను పెంచనున్నాయి. టాటా మోటార్స్, హోండా, రెనో కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నాయి. కార్లపై 2-3 శాతం మేర రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. కార్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి ఇండియాతో పాటు లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, ఆడి కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ మరియు ఫీచర్ మెరుగుదల ఖర్చులను భర్తీ చేయడానికి జనవరి నుండి ధరలను పెంచనున్నట్లు గత గురువారం తెలిపారు.
స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ మరియు విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కంపెనీ ధరలను పెంచాల్సి వస్తుందని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. వీటి పెరుగుదల కారణంగా కార్లు ధరలను పెంచడంతో ఎంతో కొంతో భారాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.