ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

-

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఎంపికైన వారు నేరుగా గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు సొంతం చేసుకోవచ్చు.


పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
మొత్తం ఖాళీలు: 50. జనరల్ డ్యూటీ 30, కమర్షియల్ పైలట్ లెసెన్స్ 10, టెక్నికల్ ఇంజినీరింగ్ 6, మెకానికల్ 5
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ అర్హతలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదవి ఉండాలి.
ఎంపిక: స్టేజ్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు (పీపీ అండ్ డీటీ) ఉంటాయి.
స్టేజ్-2లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి.
స్టేజ్-2లో ఎంపికైన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడుతారు.
వయస్సు: 01-07-1997 – 30-06-2001 మధ్య జన్మించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 6 నుంచి 17 సాయంత్రం 5.30గంటలకు స్వీకరిస్తారు.
ప్రవేశ పత్రాలు: డిసెంబర్ 28 నుంచి కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి
పరీక్ష తేదీ: స్టేజ్-1 ప్రాథమిక పరీక్షలు జనవరి ప్రారంభంలో నిర్వహిస్తారు. తుది నియామకాలు ఫిబ్రవరిలో ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: గోవా, చెన్నై, కోల్‌‌కతా, నోయిడా
www.joinindiancoastguard.gov.in

Read more RELATED
Recommended to you

Latest news