ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీ గా పెరిగి పోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో… కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 93,733 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 195 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,73,952 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,525 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,89,137 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 129.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు 65.06 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/cxlNpxfp5v pic.twitter.com/40VRDCIUM8
— Ministry of Health (@MoHFW_INDIA) December 8, 2021