కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మితున్ రెడ్డి లు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సంధర్బంగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఏపీకి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు.అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించి ఓ నివేధికను అమిత్ షా కు అందజేశారు.
అదే విధంగా పోలవరం ఏపీకి జీవనాడి అని ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన వ్యయం విషయమై ఆమోదముద్ర వేయాలని కోరారు. అదే విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో భారీ నష్టపోయామని వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థికసాయం అందించాలని అమిత్ షాను ఎంపీలు కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అమిత్ షాను కోరారు.