హెలికాప్టర్ క్రాష్.. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే.. కీలకం కానున్న ’’బ్లాక్ బాక్స్‘‘…

-

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మొత్తం 14 మందిలో 13 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం సమయంలో ప్రాణాలతో బయటపడిన సీడీఎస్ బిపిన్ రావత్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హెలికాప్టర్ ఎలా కూలిందనే సందేహాలు ప్రజల్లో, అధికారుల్లో తెలెత్తుతున్నాయి. MI -15V5 వంటి అత్యాధునిక, శక్తివంతమైన హెలికాప్టర్ ఎలాంటి హెచ్చిరికలు చేయకుండా ఎలా కూలిందనే అనుమానాలు వస్తున్నాయి. అది కూడా సీడీఎస్ గా ఉన్న బిపిన్ రావత్ ఉన్న హెలికాప్టర్ కూలడం అందరిని షాక్ కు గురిచేస్తుంది. అయితే చెట్లను ఢీకొనడం వల్ల కూలిందా..? బ్యాడ్ వెదర్ వల్ల కూలిందా…? ఏదైనా సాంకేతిక సమస్యా..? లేక ఏదైనా విద్రోహం దాగుందా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే వీటన్నింటికి సమాధానం ఒక్క ’’బ్లాక్ బాక్స్‘‘ మాత్రమే చెప్పగలదు.

ప్రస్తుతం ఈ ’’ బ్లాక్ బాక్స్‘‘ గురించి అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. హెలికాప్టర్ లో ఉండే బ్లాక్ బాక్స్ అత్యంత దారుణ ప్రమాదాల్లో కూడా సేఫ్ గా ఉంటుంది. దీంట్లోనే ఫ్లైట్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. బ్లాక్స్ బాక్స్ అనేది కాక్ పిట్ వాయిస్ రికార్డ్( CVR), ఫ్లైట్ డాటా రికార్డర్( FDR) అనే రెండు భాగాలు ఉంటాయి. అయితే క్యాబిన్ లో పైలట్ల మధ్య సంభాషణను CVR లో రికార్డ్ అవుతుంది. విమానం లేదా హెలికాాప్టర్ లోని అన్ని విభాగాలు స్పీడ్, ఎత్తు, గాలి వేగం, ఇంధన సరఫరా, ఇంజన్ రొటేషన్, ఇతర వివరాలు FDRలో రికార్డ్ అవుతాయి. ఫ్లైట్ ప్రయాణంలో కీలకంగా ఉండే రడ్డర్, ఎలివేటర్, ఏలరాన్ వంటి పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా.. అనే వివరాలు FDRలో రికార్డ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ బ్లాక్ బాక్స్ దొరికితే హెలికాప్టర్ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news