ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా మ‌రో రికార్డు

-

టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రా మ‌రో రికార్డు సృష్టించాడు. కానీ ఈ సారి మైదానం లో కాకుండా.. గూగుల్ లో త‌న రికార్డు ను నెల‌కోల్పాడు. 2021 సంవ‌త్సరానికి సంబంధించి.. గూగుల్ లో అత్య‌ధిక మంది సెర్చ్ చేసిన వ్య‌క్తు ల‌లో టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రా మొద‌టి స్థానం లో ఉన్నారు. టోక్యో ఒలింపిక్ లో నీర‌జ్ చోప్రా స్వ‌ర్ణ ప‌త‌కం నెగ్గిన త‌ర్వాత నాటి నుంచి నీర‌జ్ చోప్రా దేశ వ్యాప్తం గా ఫేమ‌స్ అయ్యారు.

దీంతో గూగుల్ నీర‌జ్ చోప్రా గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య గ‌ణ‌నీయం గా పెరిగింది. అలాగే గూగుల్ అత్య‌ధికం గా సెర్చు చేస‌ని వారి జాబితా లో రెండు స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు డ్ర‌గ్స్ కేసు లో ప‌ట్టుబ‌డ్డ ఆర్య‌న్ ఖాన్ ఉన్నాడు. అత‌ని త‌ర్వాత పంజాబీ న‌టీ షెహనాజ్ గిల్, న‌టి శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా తో పాటు టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్, పీ వీ సింధు, భ‌జ‌రంగ్ పూనియా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news