ప్రపంచ వ్యాప్తంగ ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలకు కలవరపరుస్తోంది. ఇన్నాళ్లు డెల్టా వేరియంట్ లో బాధపడుతున్న పలు దేశాలకు ఓమిక్రాన్ సవాల్ విసురుతోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కేసులు అత్యంత వేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ వల్ల మరణాలు లేకపోవడం కాస్త ఉపశమనం.
ప్రపంచంలో ఇప్పటి వరకు 57 దేశాలకు ఓమిక్రాన్ కరోనా వేరియంట్ విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2172 మందికి ఓమిక్రాన్ సోకింది. ఇండియాలో ఇప్పటి వరకు 23 మందికి ఓమిక్రాన్ కరోనా సోకింది. దీంట్లో ప్రస్తుతం మహారాష్ట్రలో ఓమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్నాడు. డెన్మార్క్ లో 577, యూకేలో 568, సౌతాఫ్రికాలో 360, యూఎస్ లో 55, జింబాబ్వేలో 50 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలకు కూడా ఓమిక్రాన్ విస్తరించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వ్యక్తుల పరిస్థితిని అన్ని దేశాల వైద్య నిపుణులు క్షుణ్ణంగా గమనిస్తున్నారు.