ఆదిలాబాద్ కలెక్టర్ పై గొనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు..ఆమె చీర తడుపుతా !

-

ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. త‌న‌ బయోడేటా గురించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరా తీశారని… ఓ జర్నలిస్ట్ ను అడిగి నా గురించి తెలుసుకున్నారని ఆమె పై ఫైర్ అయ్యారు గొనె ప్ర‌కాష్‌.

ఆ కలెక్ట ర్ చీర తడపకపోతే నా పేరు గొనె ప్రకాష్ రావే కాదు.. కలెక్టర్ ఛాంబర్ సీసీ ఫుటేజ్ అడిగా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు గొనె ప్ర‌కాష్‌. 22 మంది టీఆరెస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఛాం బర్ లో ఏం చేశారని ప్ర‌శ్నించారు. 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పి చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ ఛాంబర్ లో ఎలా ఉంటారని నిప్పులు చెరిగారు గొనె ప్ర‌కాష్‌.. కేసీఆర్ తెలంగాణ భాషలో లాగు తడవాలని అంటారని….ఇప్పుడు తాను ఆమె చీర తడుపుతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్.

Read more RELATED
Recommended to you

Latest news