ఆర్మీ హెలికాప్టర్ MI -15V5 కుప్పకూలడంతో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మధులిక రావత్.. మరో 11 మంది మరణించారు. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుంటే.. 13 మంది మరణించారు. కేవలం ఒక్కరు మాత్రమే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయాలపాలైన గ్రూప్ కెప్టెన్ వరణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం వరణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రిలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై చికిత్స పొందుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాదంపై ప్రకటన చేస్తూ రక్షణ శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. వరణ్ సింగ్ ను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరుణ్ సింగ్ ఆరోగ్యం విషమంగా ఉన్నా.. ప్రస్తుతానినికి నిలకడగా ఉన్నట్లు సైనిక వర్గాల సమాచారం. అవసరం అయితే వెల్లింగ్టన్ ఆసుపత్రి నుంచి బెంగళూర్ లోని కమాండ్ హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.