పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ని ఇవ్వడానికి ఇబ్బంది పడక్కర్లేదు అంది. అలానే ఏడాదిలో ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఎప్పుడు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినా ఏడాది వేలిడిటీ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు పెన్షన్ పొందేందుకు తాము జీవించి ఉన్నట్టు ఈపీఎఫ్ఓకు ప్రూఫ్ చూపించాలి.
దీనికి ప్రతీ ఏటా జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. లేదంటే పెన్షన్ ఆగిపోతుంది. ఈపీఎఫ్ఓలో రిజిస్టరైన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 కింద పెన్షన్ వస్తుంది. ప్రతీ ఏటా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. అప్పుడే జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే ఏడాది వేలిడిటీ ఉంటుంది.
ఇందుకోసం ఈపీఎఫ్ఓ చివరి తేదీని ఫిక్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్ విషయంలో పెన్షనర్లకు భారీ ఊరట కల్పించింది ఈపీఎఫ్ఓ. ఇకపై లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీలు ఉండవు. పెన్షనర్లు ఏడాదిలో ఎప్పుడైనా జీవన ప్రమాణ పత్రం ఇవ్వచ్చు.
ఉదాహరణకు పెన్షనర్లు 2021 నవంబర్ 24న లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే 2022 నవంబర్ 23 వరకు ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది. అలానే పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు, కామన్ సర్వీస్ సెంటర్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, పోస్ట్‌మ్యాన్, ఉమాంగ్ యాప్ ద్వారా, సమీపంలోని ఈపీఎఫ్ఓ ఆఫీసులో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయొచ్చు.