మగ సంతానం కోసం ఆరాటం.. ముగ్గురు ఆడపిల్లల హత్య

-

మగ సంతానంపై ఆశ ఆ కన్న తల్లి కండ్లను కప్పి వేసింది. కర్కశత్వాన్ని బయటకు తీసింది. ఆడపిల్లలు పుట్టిన వెంటనే పురిటిలోనే కడతేర్చింది. ఒక్కరు కాదు ముగ్గుర్ని. నాలుగేండ్లలో అభంశుభం తెలియని పసికందులను అంతం చేసింది. డిసెంబర్ 2న పుట్టిన మూడో ఆడపిల్లను కూడా హత్య చేయడంతో ఆ కర్కశ తల్లి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నది. ఆడ పసికందుల హత్యలకు పాల్పడిన మహిళను బొంత లక్ష్మిగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం తనకు పుట్టిన ఆడపిల్ల నురుగులు కక్కుతున్నదని బొంత లక్ష్మి సమాచారం ఇవ్వడంతో ఆరోగ్య కార్యకర్త ఎం స్వప్న, ఇతర ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి పరిశీలించారు. ఆ పసికందును పరిశీలించిన ఆరోగ్య కార్యకర్తలు చికిత్స కోసం గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

ఆ మరుసటి రోజు లక్ష్మి ఇంటికి వెళ్లిన స్వప్నకు విషాదకరమైన విషయం తెలిసింది. తన కూతురు మృతిచెందిందని, మృతదేహాన్ని ఖననం చేసినట్లు తెలిపింది. అయితే, లక్ష్మి ప్రవర్తనపై ఆరోగ్యకర్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఆరోగ్య స్వప్న పసికందు మరణంపై చుట్టు పక్కల వారిని ఆరా తీసింది. ఆ పిసికందును లక్ష్మి గొంతు నులిమి హత్య చేసినట్టు వెల్లడైంది.

ఆరోగ్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మిని అరెస్టు చేసి పోలీసులు విచారణ జరిపారు. అయితే, నిందితురాలు తెలిపిన విషయాలు పోలీసులను షాకింగ్ గురిచేసింది. ఒకరు కాదు ముగ్గురు ఆడపిల్లలను పుట్టిన వెంటనే హత్య చేసినట్లు వెల్లడించింది.

బొంత లక్ష్మి నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కూతురును చంపడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. కొడుకు పుట్టాలనే ఆరాటంతో గత నాలుగేండ్ల కాలంలో పుట్టిన ముగ్గురు కూతుర్లను లక్ష్మి హత్య చేసినట్టు వెల్లడించారు.

నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 302, 201 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news