సైన్యం బలోపేతం దిశగా మరో ముందడుగు.. పినాక – ఈఆర్ రాకెట్ పరీక్ష సక్సెస్

-

సైన్యం బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా పినాక రాకేట్ వ్యవస్థ ఎక్స్ టెండెడ్ రేంజ్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. గత మూడు రోజులుగా దశల వారీగా పరీక్షలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లోని పోక్రాన్ ఏరియాలో ఈ టెస్టింగ్ లు జరుగుతున్నాయి.  డీఆర్డీవో, సైన్యం ఈ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్ని పరీక్షలు సక్సెస్ ఫుల్ గా సాగాయని రక్షణ శాఖ తెలిపింది. డీఆర్డీవో తో పాటు హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లాబొరెటరీ సంయుక్తంగా ఈ రాకేట్ వ్యవస్థను డెవలప్ చేశాయి. పినాకా ఎంకే-ఐ రాకెట్ వ్య‌వ‌స్థ సుమారు 40 కిలోమీట‌ర్ల ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌దు. అలాగే పినాకా-2 వేరియంట్ 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చిత్తు చేస్తుంది. ఇక పినాకా-ఈఆర్ రేంజ్‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news