వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల్లో చికెన్ పాక్స్ కూడా ఒకటి. చికెన్ ఫాక్స్ వస్తే జ్వరం తీవ్రంగా ఉంటుంది. అలానే ఒళ్ళంతా కూడా పొక్కులు మాదిరి వచ్చేస్తాయి. అయితే చాలా మంది చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అమ్మవారు వచ్చిందని.. తల్లి పోసింది అని అంటూ ఉంటారు.
అయితే ఎందుకు అలా అంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చికెన్ పాక్స్ వచ్చిందంటే ఇంగ్లీష్ మందులు వాడరు. తగ్గేవరకు కూడా అలానే ఉంచుతారు. వేపాకులను రాయడం లేదా వేపాకు పసుపు కలిపి చర్మంపై పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
స్నానం కూడా చేయించకుండా తగ్గేవరకు కూడా అలానే వదిలేస్తారు. అయితే అసలు ఎందుకు అమ్మవారు వచ్చింది అని అంటారు అనేది చూస్తే.. పూర్వకాలంలో జ్వరాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. చిన్నపిల్లల్లో తీవ్ర జ్వరాన్ని కలిగించే వాడట అయితే ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. చిన్నారులు మాత్రం చాలా అవస్థలు పడే వారు. దీనితో తమ పిల్లల్ని కాపాడాలంటూ దుర్గా దేవిని ప్రార్ధించడం మొదలుపెట్టారు.
అప్పుడు అమ్మవారు స్వయంగా పిల్లలు శరీరం పైకి ప్రవేశించి అలా వచ్చినప్పుడు శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వచ్చి చర్మం పొంగినట్టు ఉండేది. అప్పటినుండి కూడా శరీరంపై ఇలా వచ్చినప్పుడు శరీరంపై ఉండే దుష్టశక్తిని అమ్మవారిని తొలగిస్తుందని ప్రజలకు నమ్మకం కలిగింది. అందుకని ఎలాంటి మందులు అవసరం లేదని అనుకున్నారు. ఇప్పటికీ ప్రజలు ఇంకా మందుల్ని ఉపయోగించరు. అందుకే ఈ చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు తల్లి పోసింది అని అమ్మ వచ్చింది అని అంటూ ఉంటారు.