వ్యాక్సిన్ తీసుకున్నా చంఢీగడ్ లో ఓమిక్రాన్ పాజిటివ్… 35కు చేరిన టోటల్ కేసులు

-

దేశంలో మరోసారి ఓమిక్రాన్ కలకలం కలిగిస్తోంది. తాజాగా ఏపీలో మొదటి కేసు నమోదు అయింది. మరోవైపు రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల వ్యక్తి గత నవంబర్ 22న భారతదేశంలో అడుగుపెట్టాడు. అయితే అతను డిసెంబర్ 1న కోవిడ్‌తో బాధపడుతున్నాడు. వైద్యారోగ్యశాఖ అతనికి ఓమిక్రాన్ పరీక్ష చేయగా.. పాజిటివ్ వచ్చింది. కాగా సదురు వ్యక్తి ఫైజర్ వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిందని చంఢీగడ్ హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.  మరోవైపు ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల యువకుడికి ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొదటి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీివల ఐర్లాండ్ నుంచి ముంబైకి వచ్చిన సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో అతనికి నెగిటివ్ రావడంతో విజయనగరం రావడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే ఆతర్వాత కరోనా సోకడంతో ఓమిక్రాన్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ గా తేలింది.

ప్రస్తుతం ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. మహారాష్ట్రలో 17, రాజస్థాన్ లో 9, కర్ణాటకలో 2, ఢిల్లీలో 2, గుజరాత్ లో 3, ఏపీలో 1, చంఢీగడ్ లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news