హిందూ.. హిందుత్వవాదిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…

-

మరోసారి హిందు, హిందుత్వవాది పదాలు రాజకీయంలోకి వచ్చాయి. తాజాగా జైపూర్ లో ద్రవ్యోల్భనంపై జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, హిందుత్వవాది పదాలపై పలు వ్యాఖ్యలు చేశారు. నేడు భారత రాజకీయాల్లో  రెండు ప్రపంచాల మధ్య పోటీ ఉంది.  ‘హిందూ’ మరియు ‘హిందుత్వవాది’. రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. నేను హిందువును కానీ హిందుత్వవాది కాదు… మహాత్మా గాంధీ హిందువని.. గాడ్సే హిందుత్వవాది అంటూ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వవాదులు తమ జీవితాంతం అధికారం కోసం ప్రయత్నిస్తుంటారని.. వారికి అధికారం తప్ప మరేది అవసరం లేదని అన్నారు. rahul gandhiవారు ‘సత్యాగ్రహం’ కాదు ‘సత్తాగ్రహం’ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు అని అన్నారు. హిందూత్వవాదులకు అధికారం మాత్రమే కావాలి మరియు వారు 2014 నుండి అధికారంలో ఉన్నారు. మనం ఈ హిందుత్వవాదులను అధికారం నుండి తరిమికొట్టాలని.. హిందువులను తిరిగి తీసుకురావాలని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువు.. ప్రతి ఒక్కరినీ ఆలింగనం చేసుకునేవాడు, ఎవరికీ భయపడడు మరియు ప్రతి మతాన్ని గౌరవిస్తాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news