ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. దేశంలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియు కొనసాగుతోంది. అయితే.. ఎఫ్ సీఐ వెబ్ సైట్ ఆన్ లైన్ లో నమోదైన లెక్కల ప్రకారం దేశంలో 20 రాష్ట్రలు ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాయి.
ఇందులో అత్యంత వేగంగా ధాన్యం కొనుగోలు చేసిన దక్షిణాది రాష్ట్రలలో… తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా కొనుగోలు చేస్తున్న పంజాబ్, హర్యానా రాష్ట్రలు అత్యధికంగా.. వేగవంతంగా ధాన్యం కొనుగోలు లో మొదటి, రెండో స్థానంలో ఉండగా.. కేవలం 7 సంవత్సరాల తెలంగాణ ఆ రాష్ట్రలకు ధీటుగా మూడో స్థానంలో నిలిచిందని అధికారులు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా… పక్క రాష్ట్రలైన ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటి వరకూ 1.63 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. తమిళ నాడు 6.37 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.