ఇసుక లారీని ఢీకోట్టిన ఆర్టీసీ బస్సు… ప్రమాదంలో 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

డ్రైవర్ల అజాగ్రత్త మరో  ప్రమాదానికి కారణమైంది. తాజాగా జయశంకర్ భూపాలపల్ల జిల్లాలో ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. జయశంకర్ జిల్లా కాటారం మండలం చింతకాని వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

గాయపడిన వారిని స్థానికుల సహాయంతో మహాదేవాపూర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భూపాలపల్లి డిపోకు చెందిన బస్సు కాలేశ్వరం నుండి భూపాల్ పల్లి వైపు వెళ్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి కాటారం సిఐ రంజిత్ రావు చేరుకొని క్షతగాత్రులను మహదేవ్పూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కాళేశ్వరం ఇసుక రీచుల నుంచి వచ్చే లారీలతో ఈరోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.