కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్ తో ఏంటండి మీరు, ఏమైంది మీకు ఒక ప్రాణం మీకళ్ల ముందు విలవిలలాడుతుంటే.. చూస్తుండిపోయారేంటి అంటుంది. ఏం చేయాలి దీప అంటాడు కార్తీక్. మీరొక డాక్టర్ అంటుంది. నేను ఇప్పుడు డాక్టర్ ని కాను, నా డాక్టర్ పట్టా రద్దు చేశారు, నేను డాక్టర్ గా కొనసాగలేను అంటాడు. డాక్టర్ బాబు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అంటే..ప్లీజ్ దీప నన్ను అలా పిలవకు, నువ్వు పిలుస్తుంటే.నేను చేసిన పాపమే గుర్తుకొస్తున్నాయి..వృత్తి వదిలేశారు, మానవత్వాన్ని కూడా వదిలేశారా అండి అంటుంది. నేను మానసికంగా ఆ పేషంట్ చనిపోయినప్పుడే చచ్చిపోయాను, నువ్వు ఇప్పుడు మానవత్వం గురించి మాట్లాడుతున్నావ్ అంటాడు కార్తీక్. ఏంటండీ మీరు..ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఆ శ్రీవల్లికి ఇక్కడే పురుడుపోయగలరు కానీ చేయలేదు..ఇక్కడికి హాస్పటల్ ఎంత దూరంలో ఉందే..దారిలో మధ్యలో ఏమైన జరిగితే అంటుంది దీప. ఆపు దీప అంటాడు కార్తీక్. నన్ను ఆపగలరేమో, అధికారింకంగా మీరు డాక్టర్ వృత్తికి దూరమయ్యారు అంతే, మీకొక విషయం చెప్పమంటారా అని..ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అంటే..రుద్రాణిగారిది అన్నావుగా..కాదండి..శ్రీవల్లి వాళ్లదే..అప్పు తీసుకున్నారని ఇంట్లోంచి సామాన్నలు గెంటేశారు. వాళ్లు మనకు ఎప్పుడో సాయం చేశారండి..వాళ్లంట్లోనే కదా మనమూ మన పి్లలలు ఉంటున్నాం. వాళ్లు చెట్టుకింద ఉంటున్నారు అండి అంటుంది దీప..నేను ఇప్పుడే వస్తాను అని కార్తీక్ అంటాడు.
మోనిత కార్తీక్ ఫోన్ కు కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ తీసుకున్న అతను ఆదిత్య వాళ్లు అన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడు కదా..ఈ మోనిత ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ మాట ఈ మాట చెప్పి..ఆ ఫోన్ ఎక్కడదొరికింది అంటే..వాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు. మోనిత 25వేలు ఇస్తుంది. వాడు చూసింది చెప్తాడు. బస్సు ఎక్కి వెళ్లారంటే..ఎక్కడికి వెళ్లారు..ఈ విషయం సౌందర్య ఆంటీకి తెలియకుండా ఉంటుందా, వీళ్లంతా తెలిసే దాస్తున్నారా..మీరు గేమ్ ఆడితే..నేను డబుల్ గేమ్ ఆడతాను, చూసుకోండి ఈ మోనిత ఏం చేస్తుందో అంటుంది.
ఇక్కడ కార్తీక్ ఆ చెట్టుకింద సామాన్లు చూసి..వాళ్లకు ఎటూ సాయం చేయలేకపోయాను, కనీసం వాళ్ల సమాన్లు అయినా ఇంట్లోకి చేరుస్తాను అనుకుని ప్యాక్ చేయబోతాడు. ఆ రుద్రాణి మనషులు వచ్చి నువ్వేం చేస్తున్నావో తెలుసా అంటే..ఇంట్లో ఉండే సామాన్లు బయటఉన్నాయని లోపలపెడుతున్నాను అంటాడు కార్తీక్. మేం ఎవరో తెలుసా అంటే..మనుషులే కదా అంటాడు కార్తీక్. వాళ్లు తెగబిల్డప్ ఇస్తారు. కార్తీక్ మాత్రం మూటకట్టి సామాన్లు తీసుకొని వెళ్లబోతాడు. వాళ్లు కార్తీక్ ను కొడదాం అనుకుంటే..కార్తీక్ ఆ మూటతో వాళ్లను కొడతాడు.
ఇక్కడ మోనిత నేను నిన్ను వదలను కార్తీక్..మొబైల్ సిగ్నల్స్ లేని చోటికి కూడా మోనిత లవ్ సిగ్నల్స్ చేరుకుంటాయ్ కార్తీక్ అంటుంది. తెల్లారుతుంది..సౌందర్య ఆంటీ బాగా రెడీ అయి..దేవుడి దగ్గర కుర్చుని..తన గోడును చెప్పుకుంటూ సీన్ లాగ్ చేస్తుంది. ఏంటో ఈ సీరియల్ తలాతోక లేకుండా వెళ్తుంది. ఇప్పుడూ ఈ లాగ్ సీన్ అవసరమా. కాసేపటికి సీన్ లోకి ఆనంద్ రావు ఎంట్రీ ఇస్తాడు. దేవుడ్ని ఏం కోరుకున్నావ్ సౌందర్య అంటాడు. అసులు ఇదే ప్రశ్న..ఇంకేం కోరుకుంటారు..కార్తీక్ వాళ్ల గురించి అని తెలియదా. ఏడవకు సౌందర్య, వచ్చేస్తారులే అంటాడు.
కార్తీక్ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలు సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. కార్తీక్ గతం తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. పిల్లలు కార్తీక్ దగ్గరకు వచ్చి..అమ్మ ఇంకా రాలేదేంటి అంటారు. వస్తుందిలేరా అని కార్తీక్ మీకొక విషయం చెప్పాలమ్మా అంటాడు. ఏంటినాన్న అని పిల్లలు అడిగితే..ఇక్కడ ఎవరికి నేను డాక్టర్ ను అని మీరు చెప్పకూడదు అంటాడు. ఎపిసోడ్ ముగుస్తుంది.