నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ పాజిటివ్… హైదరాబాద్ లో వచ్చినవి ఇలాంటివే..

-

ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వచ్చాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, యూకే దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారికి ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. అయితే హైదరాబాద్ లో వచ్చిన కొత్త కేసుల్లో ఆసక్తికర విషయం బయటపడింది. ప్రస్తుతం తెలంగాణలో నమోదైన రెండు కేసుల్లో వచ్చిన వారు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. సోమాలియా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి, కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల యువతికి ఓమిక్రాన్ పాజిటివ్ గా వచ్చినట్లు తెలంగాణ డీహెచ్ వెల్లడించారు. ఇద్దరిని టోలిచౌకి, మెహదీపట్నం వ్యక్తులుగా గుర్తించారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారిని  కూడా ఐసోలేషన్ లో ఉంచనున్నారు అధికారులు. మరోవ్యక్తి 7 ఏళ్ల బాలుడు తెలంగాణ మీదుగా బెంగాళ్ వెళ్లారని తెలిపారు. ఇప్పటి వరకు ఎట్ రిస్క్ ఉన్న దేశాల వారికి మాత్రమే ఓమిక్రాన్ వచ్చింది. కాగా తాజాగా హైదరాబాద్ లో నమోదైన కేసులు మాత్రం నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ సోకినట్లు తెలింది.

Read more RELATED
Recommended to you

Latest news