UnstoppableWithNBK : బాలయ్య షో లో రాజమౌళి సందడి

-

నటసింహం నందమూరి బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు వారి ఓటీటీ ఆహాలో ఈ షో ప్రసారమవుతోంది. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా బాలయ్య అభిమానులను తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ షో రేటింగ్ లోను దూసుకుపోతోంది. తాజాగా… ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి వచ్చారు. ఇక ఈ షో లో బాలయ్య తో రాజమౌళి, ఎం ఎం కీరవాణి సందడి చేశారు. అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోలను తాజాగా ఆహా సంస్థ విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా. కాగా ఈ షో లో ఇప్పటికే నాని, మోహన్ బాబు, బ్రమహనందం గెస్ట్ లుగా వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news