ఎఫ్-2 ఫిఫ్టీ డేస్.. ఎన్ని సెంటర్స్ తెలిస్తే షాక్ అవుతారు..!

-

సంక్రాంతి భారీ సినిమాల మధ్య ఎలాంటి సైలెంట్ గా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా ఎఫ్-2. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా 106 కేంద్రాలలో 50 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది.

Mehreen Pirzada, Varun Tej, Venkatesh, Tamannaah in F2 Movie 50 Days Posters HD

ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు వారం, పది రోజులు ఆడటమే ఎక్కువ అనుకుంటున్న టైంలో ఎఫ్-2 మరోసారి వెంకటేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే 140 కోట్ల గ్రాస్ వసూళు చేసిందని తెలుస్తుంది. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా దర్శక నిర్మాతలనే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు మిగిల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news